top of page
Writer's pictureAPTEACHERS

పాఠశాల విద్యా శాఖ AP టీచర్ BOT - స్విఫ్ట్‌చాట్ యాప్‌

Updated: Feb 24, 2024

పాఠశాల విద్యా శాఖ AP టీచర్ BOT - స్విఫ్ట్‌చాట్ యాప్‌


ఉపాధ్యాయులందరికీ ఇది తప్పనిసరి.



1. AP Teacher Bot - How to Teacher Registration Process in Swift Chat.


2. స్కూల్ యూ డైస్ కోడ్ మరియు ఉద్యోగి సి.యఫ్.యం.యస్ ఐడి తో లింకు చెయ్యాలి.


3. బోధిస్తున్న తరగతిని, సబ్జెక్టు లను మ్యాప్ చేయు విధానము.


4. ఈ ప్రొసెస్ అందరు ఉపాధ్యాయులు చెయ్యాలి.


5. ఈ ప్రొసెస్ అంతా 10-02-2024 లోగా అనగా మరో 2 రోజులలోనే చెయ్యాలి.


6. ఈ ప్రొసెస్ Swift Chat యాప్ లేక Web Site ద్వారా చెయ్యాలి.


AP TEACHER BOT ఆని పిలవబడుతున్న SWIFT CHAT APP అనేది గతంలో రిజష్టర్ అయ్యాము.


Play store లోకి వెళ్ళి SWIFT CHAT అని టైప్ చేయండి.


Download చేసుకోండి


మీ ఫోన్ నెంబరుతో రిజష్టర్ అవ్వండి


గతంలో రిజష్టర్ అయిన వారికి వివరాలు అన్నీ వస్తాయి.


అసలు రిజష్టర్ కాని వాళ్ళు cfms ID తో వివరాలు ఇవ్వాలి.


🌷స్విఫ్ట్ చాట్ ప్రత్యేకతలు ఇవీ🌷


🌴తెలియని అంశాన్ని వాట్సాప్ చాట్ మాదిరిగా ఈ స్విఫ్ట్ చాట్లో ఎస్ఎం ఎస్ చేస్తే క్షణంలో దానికి సమాధానం ప్రత్యక్షమవుతుంది.


🍁 అలాగే ఈ యాప్ 1నుంచి 10వ తరగతి వారీగా డిజిటల్ తరగతులు, లైవ్ క్విజ్లు, కాంపిటేషన్ జోన్, స్కిల్ కార్నర్లు, రివార్డులు ఈ యాప్లో పొందుపరిచారు.


🌴 నచ్చిన అంశాన్ని సేవ్ ఐటమ్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది.


⛱️ప్రస్తుతం ఒకటి, రెండు తరగతుల గణితం, మూడు నుంచి పదో తరగతి వరకూ గణితం, సైన్స్ సబ్జెక్టులపై మాత్రమే డిజిటల్ తరగతులు, క్విజ్లు అందుబాటులో ఉన్నాయి.


🌴 మిగిలిన సబ్జె క్టులపై కూడా భవిష్యత్లో డిజిటల్ క్లాసులు పొందుపర్చనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.


🔳 ఆధునిక విద్యాబోధనలో-అంతర్భాగంగా నూతన యాప్‌


🔳 ఉపాధ్యాయులకు సహాయకారిగా-అమల్లోకి తెచ్చిన పాఠశాల విద్యాశాఖ.


🔳 తొలిదశలో ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ స్కూళ్లలో అమలు


🔳 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారుల ఆదేశాలు


👁️‍🗨️👁️‍🗨️ బ్లాక్‌బోర్డు స్థానంలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ)లను పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఆధునిక విద్యాబోధనను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం విద్యాబోధనలో ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేందుకు మరో అడుగు ముందుకేసింది.


👁️‍🗨️👁️‍🗨️ ఉపాధ్యాయులు తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఎటువంటి ప్రశ్నకై నా సమాధానాన్ని కనుగొనే నూతన విధానంలో తాజాగా స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాంపై పనిచేసే విధంగా దీనిని రూపొందించారు.


🛑💁‍♀️💁🏻‍♂️ స్విఫ్ట్‌చాట్‌ ప్రత్యేకతలు ఇవే...


***************************************

👁️‍🗨️👁️‍🗨️ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు, భాషలకు సంబంధించిన పాఠ్యాంశాలను మొబైల్‌ యాప్‌లో పొందుపర్చారు. స్మార్ట్‌ఫోన్‌లో స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ను కలిగి ఉన్న ఉపాధ్యాయులు తరగతిలో పాఠ్యాంశాల ను బోధిస్తున్న సమయంలో విద్యార్థులు లేవనెత్తే సందేహాలకు స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ లో సెర్చ్‌ చేసి తక్షణమే సమాధానాన్ని చెప్పే వీలుంది.


👁️‍🗨️👁️‍🗨️ అదేవిధంగా 6వ తరగతి లో సైన్స్‌ బోధిస్తున్న సమయంలో విద్యార్థి అడిగే సందేహానికి సమాచారంతో పాటు వీడియోల ద్వారా ప్రత్యక్షంగా చూపి, వివరించేందుకు వీలుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌పీలతో పాటు 8వ, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌లలో ఉన్న స్విఫ్ట్‌చాట్‌ ద్వారా ఉపాధ్యాయులు విద్యాబోధన చేసే వీలుంది. వీటితో పాటు అదనంగా మొబైల్‌యాప్‌ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.


🛑💁‍♀️💁🏻‍♂️ డౌన్‌లోడ్‌, ఇన్‌స్టాలేషన్‌ ఇలా..


**************************************

👁️‍🗨️👁️‍🗨️ స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ను ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు తొలిదశలో అమల్లోకి తెచ్చింది.


👁️‍🗨️👁️‍🗨️ యాప్‌ డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్‌తో పాటు ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ సమాచారాన్ని విద్యాశాఖ ఐటీ సెల్‌ డీఈఓ కార్యాలయంతో పాటు ఎంఈఓ కార్యాలయాలకు పంపింది.


👁️‍🗨️👁️‍🗨️ విద్యాశాఖ పంపిన లింక్‌ ద్వారా ఉపాధ్యాయులు స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ను విధిగా డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుని, ఏపీ టీచర్‌ బోట్‌ను సెలక్ట్‌ చేసుకుని క్లిక్‌ చేయాలి.


👁️‍🗨️👁️‍🗨️ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకుని తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, విద్యాశాఖ పంపించే ఓటీపీని నమోదు చేయాలి. ఈ విధంగా ఎంటర్‌ చేయగానే హాయ్‌ అనే మెసేజ్‌ ప్రత్యక్షమవుతుంది.


👁️‍🗨️👁️‍🗨️ స్క్రీన్‌పై కనిపించే నెక్ట్స్‌ అనే విండోపై క్లిక్‌ చేసి, యూడైజ్‌ కోడ్‌ సబ్మిట్‌ చేయాలి. స్కూల్‌కోడ్‌ సరైనదీ, లేనిదీ నిర్ధారించుకుని కన్‌ఫర్మేషన్‌ చేయాలి.


👁️‍🗨️👁️‍🗨️ తదుపరి ఉపాధ్యాయులు తమ సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీని ఎంటర్‌ చేసి, అప్‌డేట్‌ టీచర్‌ డీటైల్స్‌, డౌన్‌లోడ్‌ రిపోర్ట్‌పై క్లిక్‌ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.


🛑💁‍♀️💁🏻‍♂️ విధిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..


👁️‍🗨️👁️‍🗨️ ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ స్విఫ్ట్‌చాట్‌ యాప్‌ను విధిగా డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్టర్‌ చేసుకోవాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.


AP Teacher BOT Swift Chat App


పాఠశాల విద్యా శాఖ AP టీచర్ BOT పేరుతో ప్రత్యేకమైన BOTని అభివృద్ధి చేసింది. అందరు ఉపాధ్యాయులు క్రింది వెబ్ పేజీలోని లింక్ ద్వారా స్విఫ్ట్‌చాట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని, AP టీచర్ బాట్ ని ఎంచుకోవాలి.👇🏿



 పాఠశాల విద్యా శాఖ AP టీచర్ BOT పేరుతో ప్రత్యేకమైన BOTని అభివృద్ధి చేసింది.  స్విఫ్ట్‌చాట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, AP టీచర్ బాట్ని ఎంచుకోండి.  మీ UDISE కోడ్ మరియు CFMS IDని ఉపయోగించి నమోదు చేసుకోండి.  ఆపై 10.02.24 లేదా అంతకంటే ముందు మీ బోధనా తరగతి(లు) మరియు గ్రేడ్(లు) ఎంచుకోండి.


 స్విఫ్ట్‌చాట్ యాప్‌ app ⬇️



AP TEACHER BOT రిజిస్ట్రేషన్ లింక్⬇️


68 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page